Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Sep-2017 10:51:10
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాడు. తన తర్వాతి సినిమా ఎవరితో చేయాలన్నదే ఆ కన్ఫ్యూజన్. ఓవైపు బాలయ్యతోనే మరో సినిమాకు కథ రెడీ చేశాడని.. అదొక పొలిటికల్ థ్రిల్లర్ అని.. బాలయ్య ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి. మరోవైపు ‘పైసా వసూల్’ కంటే ముందు బాలయ్యతో కథా చర్చలు జరిపిన విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు పూరితో సినిమాకు తయారవుతున్నాడని.. పూరికి కబురు పంపాడని వార్తలొచ్చాయి. మరోవైపు ‘ఆంధ్రాపోరి’లో కథానాయకుడిగా నటించిన తన కొడుకు ఆకాశ్ ను హీరోగా రీలాంచ్ చేయాల్సిన సమయం కూడా ఆసన్నం కావడంతో పూరికి అది కూడా ఒక ఆప్షన్ లా కనిపించింది.

ఐతే ఈ మూడింట్లో పూరి ఏ సినిమాను ముందుగా మొదలుపెడతాడన్న సందిగ్ధత ‘పైసా వసూల్’ విడుదలకు ముందు నెలకొంది. ఐతే ఇప్పుడా కన్ఫ్యూజన్ తీరిపోయింది. పూరి ఏ సందిగ్ధత లేకుడా తన కొడుకును రీలాంచ్ చేసే పని మొదలుపెట్టేసుకోవచ్చేమో. ఈ క్లారిటీ ఇస్తోంది ‘పైసా వసూల్’ సినిమానే. డివైడ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం.. చేదు అనుభవాన్నే మిగిల్చేలా ఉంది. నష్టాలు భారీగా లేకపోయినా.. ఆశించిన ఫలితమైతే వచ్చేలా లేదు. కాబట్టి బాలయ్య అయినా.. వెంకీ అయినా పూరితో సినిమా చేయడానికి ముందుకు రావడం కష్టమే. గత కొన్నేళ్లుగా పూరి తీసిన సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటున్నా.. అతడిలో మార్పు రావట్లేదు. వరుస ఫ్లాపుల తర్వాత బాలయ్య లాంటి పెద్ద హీరో ఛాన్సిచ్చినా.. పూరి కొత్త కథ మీద దృష్టిపెట్టలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. ఈ నేపథ్యంలో పూరికి ఇంకో పెద్ద అవకాశం రావడం కష్టమే.

,  ,  ,  ,  ,