Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 11:02:34
facebook Twitter Googleplus
Photo

ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఆదాశర్మకు ఇప్పటివరకూ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ క్షణం మూవీ ఈమె కెరీర్ నే మార్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అల్ట్రా లో బడ్జెట్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ సాధించిన క్షణం.. ఆదాశర్మ కెరీర్ లో ఎప్పటికీ మెమరబుల్ మూవీనే. ఇప్పుడీ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. క్షణం రీమేక్ లో నటించేందుకు ఇప్పటికే ఒప్పుకున్నాడు.

తన మాజీ లవర్ కూతురు కిడ్నాప్ అయితే.. ఫారిన్ నుంచి వచ్చి హెల్ప్ చేసే ఈ రోల్.. సల్మాన్ కి బాగా నచ్చిందనే టాక్ ఉంది. సాజిద్ నడియడ్వాలా ఇప్పటికే రీమేక్ రైట్స్ కొనేసి సల్మాన్ తో సై అనిపించేసుకున్నాడు. మరి ఈ మూవీలో హీరోయిన్ అయిన ఆదాశర్మపాత్ర కీలకం. తెలుగులో ఆదాశర్మ నటించిన ఈ పాత్ర కోసం.. హిందీలో సంగీతా బిజిలానీని తీసుకుంటున్నారనే మాటలు వినిపించాయి. అయితే.. ఇప్పుడీ ఆఫర్ ఆదాశర్మకే వచ్చిందని తెలుస్తోంది. అంటే.. సల్మాన్ కి జోడీగా నటించనుందన్న మాట ఆదాశర్మ.

పైగా ఇక్కడికీ బాలీవుడ్ లో మేకింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సల్లూభాయ్ చేతిలో పడితే టాప్ హీరోయిన్స్ అయిపోయిన హిస్టరీ చాలా మందికే ఉంది. ఇప్పుడు క్షణంతో ఆదాశర్మకు కూడా ఇలాంటి లక్కీ ఛాన్స్ తగిలిందని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. మొత్తానికి క్షణం మూవీ.. మరోసారి ఆదాశర్మ కెరీర్ ని మార్చేయనుంది.

,  ,  ,  ,  ,