Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2015 17:45:45
facebook Twitter Googleplus
Photo

ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ కుర్రాళ్లలో టెంపర్ పెంచేసింది నోరా పథేహి. టెంపర్ లో ఐటెమ్ పాటలో ఈ భామ చిందులు ఇప్పటికీ యువతరంలో హాట్ టాపిక్. ఆ వెంటనే బాహుబలిలో ఐటెమ్ పాటలో నర్తించి మరింత పాపులర్ అయ్యింది. ముగ్గురు సన్నజాజుల మధ్య ఓ జాజికొమ్మలా కనిపించిన నోరా పతేహి అందరిలోకి హాట్ అన్న టాక్ తెచ్చుకుంది.

ఇప్పటికిప్పుడు ఈ భామ ఓ రెండు సినిమాల్లో ఐటెమ్ నంబర్ లలో చేసింది. కిక్కురో అంటూ కిక్కు2లో ఆడిపాడుతోంది. అలాగే కళ్యాణ్ రామ్ షేర్ లోనూ ఐటెమ్ నంబర్ చేసింది. ఇవి రెండూ త్వరలోనే రిలీజ్ కి రాబోతున్నాయి. మరిన్ని సినిమాలకు సంతకాలు చేయడానికి రెడీ అవుతోంది. ఈలోగానే ఈ అమ్మడు ఏకంగా బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. మై బర్త్ డే సాంగ్ అనేది టైటిల్. నటుడు సమీర్ సోని ఈ చిత్రంతో దర్శకుడు అవుతున్నాడు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. నోరా ఈ చిత్రంలో న్యూయార్క్ కి చెందిన ఇండియన్ యువతిగా నటిస్తోంది. ఐటెమ్ తో ఓ ఊపు ఊపేస్తున్న ఈ భామ కథానాయికగానూ పాపులర్ అవుతుందేమో చూడాలి.

,  ,