Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2017 16:37:10
facebook Twitter Googleplus
Photo

ఎలాగైన హిట్ కొట్టాలని కంకణం కట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు కుర్ర హీరో రామ్. ఈ శుక్రవారం నాడు ఉన్నది ఒకటే జిందగీ అంటూ వచ్చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎటువంటి పోటీ లేకుండా 27న వస్తోంది అనుకుంటే.. ఇప్పుడు అనూహ్యంగా వివాదాల సినిమా ఒకటి రేసులోకి దిగింది.

అక్టోబర్ 18న తమిళనాడులో రిలీజై.. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతున్న సినిమా.. మెర్సాల్. విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమాపై ఓ రేంజు వివాదాలు వచ్చేశాయి. కార్పొరేట్ వైద్య సంస్థలను టార్గెట్ చేశారంటూ డాక్టర్లూ.. జిఎస్టీని కామెడీ చేశాడంటూ బిజెపి నాయకులు.. మామూలు హంగామా చేయలేదు. వెరసి అవన్నీ కూడా సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగపడ్డాయ్ అంతే. ఎట్టకేలకు సెన్సార్ దగ్గరనుండి క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ అదిరింది.. ఈ శుక్రవారం రిలీజ్ అవుతోందని తెలుస్తోంది. ఈరోజు పేపర్లో.. రిలీజింగ్ దిస్ వీక్ అంటూ యాడ్లు కూడా వచ్చాయంటే.. అది నిజమనే అనుకోవాలేమో.

అదిరింది తెలుగు వర్షన్ ను శరత్ మరార్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి.. ఆయన కచ్చితంగా భారీగానే విడుదలను ప్లాన్ చేసుంటాడు.

,  ,  ,  ,  ,  ,