Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 11:23:36
facebook Twitter Googleplus
Photo

చాలా మంది ఉత్తరాది భామలు టాలీవుడ్లోకి వచ్చి స్టార్ హీరోయిన్లు అవుతున్నారు. కొంత మంది నేరుగా అవకాశాలను కొట్టేస్తున్నారు. మరికొంత మంది ఆడిషన్స్.. నటన అంటూ ఏవోవే టాలెంట్లు చూయించి సినిమా ఛాన్సులను పట్టేస్తున్నారు. ఇలాంటి కోవలోకి చెందినదే ముంబై భామ అదితి సింగ్. ఈ అమ్మడు గుప్పెడంత ప్రేమ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడం కోసం.. అలా మొదలైంది సినిమాలో నిత్య మీనన్ డైలాగులను చెప్పి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేసిందట. డైలాగులతో అయితే సాటిస్ ఫై అయ్యాడు కానీ... నువ్వు మొదట లావు తగ్గితేనే నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నాడట ఆ సినిమా డైరెక్టర్ వినోద్ లింగాల. దాంతో 85 కేజీలు వున్న తన బరువును అమాంతం తగ్గించుకుని హీరోయిన్ కు వుండాల్సిన అన్నీ క్వాలిటీస్ ను సొంతం చేసుకుందట.

ఈ చిత్రంలో శాండీ అనే పాత్రలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. హీరోతో నీ కెమిస్ట్రీ ఎలా వుంది అంటే... ఈ సినిమాకు ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య ఫ్రెండ్షిప్ బాగా బలపడటంతో... ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది. అది మీరు తెరమీద చూస్తారు అంది సినిమా దేని గురించి అంటే... ఫస్ట్ లవ్ లో ఉండే స్వచ్ఛమైన ఫీలింగ్స్... అది సక్సెస్ అయితే పొంది అనుభూతి ఎలా వుంటుందన్నదే మిగతా కథ. ఇందులో మైనస్ 4 డిగ్రీలలో కూడా చిరపుంజిలో కొన్ని సీన్స్ తీశారు. అవి చాలా ప్లీజంట్ గా వుంటాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా అన్నారు

,  ,  ,  ,  ,