Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:24:00
facebook Twitter Googleplus
Photo

సినిమా కథలు అన్నిటికీ మూలం మూడే థీమ్స్ అని అంటారు. ఒకటి ప్రేమ.. రెండు డబ్బు.. మూడు పగ. లవ్ స్టోరీ అన్ని సినిమాల్లోనూ ఉంటుంది. డబ్బుతో లింక్ అయిన సినిమాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయ్. కానీ ఇప్పుడు పగ కాన్సెప్ట్ పట్టుకుని వరుసగా సినిమాలు దాడి చేసేస్తున్నాయి. వరుసగా క్యూ కట్టేసిన రివెంజ్ స్టోరీలను చూస్తే.. జనాల మీద మూవీ మేకర్స్ ఇంత పగ పట్టేశారా అనిపించక మానదు.

ఈ శుక్రవారం విడుదలవుతున్న నిఖిల్ మూవీ కేశవ. గుండె జబ్బు- కుడివైపు గుండె - ఆవేశపడితే ఆగిపోతుంది లాంటివేవో చెప్పినా.. సింపుల్ గా అయితే ఇదో రివెంజ్ డ్రామా. కూల్ గా పగ తీర్చుకోవడమే కాన్సెప్ట్. వాసుకి అంటూ నయనతార డబ్బింగ్ మూవీ ఒకటి సమ్మర్ లోనే వస్తోంది. ఇది కూడా ఇలాంటి రివెంజ్ డ్రామానే. ఓ ముగ్గురిని ఎలాంటి సాక్ష్యం దొరక్కుండా నయన్ ఎలా చంపేసిందనేదే కథ. కొన్నేళ్ల క్రితం వెంకటేష్ - మీనా చేసిన దృశ్యం మూవీ స్టోరీ కూడా.. ఇలా సాక్ష్యాలు లేకుండా చంపేయడమే. మొన్న రిలీజైన వెంకటాపురం కూడా సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్.

నయన్ నటించిన డోరా - మయూరి సినిమా కథలు కూడా ఇలాగే ఉంటాయ్. కాకపోతే వాటిలో ఓ దెయ్యం కూడా మిక్స్ చేస్తారు. నాయకి అంటూ త్రిష చేసిన హంగామా కూడా ఇలా దెయ్యం ప్లస్ పగ. చంద్రకళ.. కళావతి అంటూ హన్సిక చేసిన రచ్చ కూడా ఇలాగే ఉంటుంది.

ఇక టాలీవుడ్ లో కూడా ఇలాంటి కథలతో చాలానే సినిమాలొచ్చాయి. అప్పట్లో నాగార్జున నటించిన మాస్ ఇలాంటిదే. సునీల్ ని చంపారని నాగార్జున పగ పట్టేస్తాడు. మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సంగతి చెప్పక్కర్లేదు.

,  ,  ,  ,  ,