Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 17:05:17
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఫిలిం నగర్ లో హాటుగా వినిపిస్తున్నగాసిప్ ఏంటంటే.. ఓ రెండు సీన్ల కోసం ఓ రెండు రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట ''సరైనోడు'' టీమ్. పదండి ఆ మ్యాటరేంటో చూద్దాం అసలు.

నిజానికి ఇప్పటికే యు/ఎ సర్టిఫికేట్ తో ''సరైనోడు'' సినిమా సెన్సార్ అయినప్పటికీ.. మనోళ్ళు కొన్ని సీన్లను రీ షూట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారట. అయితే మొత్తంగా కాకపోయినప్పటికీ.. కొన్ని సీన్లలో పంచ్ సీన్లు.. కామెడీ టైమింగ్ ను మార్చి తీస్తే అవి మరింత వర్కవుట్ అయ్యే ఛాన్సుందని సరైనోడు యునిట్ ఫీలైనట్లు తెలుస్తోంది. ఎలాగో రిలీజ్ కు ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి.. ఓ 2 రోజులు షూట్ చేసి.. వాటిని యాడ్ చేసి ప్రింటును అందరికీ పంపించేయడం మరీ పెద్ద కష్టమైన విషయం ఏం కాదు.

అయితే ఈ సీన్లను రీ-షూట్ చేసే ఐడియా ఎవరిచ్చారు? సన్నిహితులు చెబుతోందేంటంటే.. మెగాస్టార్ చిరంజీవికి సినిమా ప్రివ్యూ వేసిన తరువాత ఆయన ఈ ఐడియాలను ఇచ్చారని.. అవే బన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడని టాక్.

,  ,  ,  ,  ,  ,