Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 11:35:12
facebook Twitter Googleplus
Photo

అజ్ఞతవాసి రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా.. బ్యాలెన్స్ ఉన్న సీన్స్ ను ప్రస్తుతం హైద్రాబాద్ లో షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

ఇక ఓవర్సీస్ లో కూడా అజ్ఞాతవాసి బజ్ బిగిన్ అయిపోయింది. పవర్ స్టార్ తో మాటల మాంత్రికుడు చేసిన మాయపై అందరూ ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను భారీ రేట్లకే విక్రయించారట. పైకి చెప్పడం లేదు కానీ.. ఈ ఫిగర్ చాలా ఎక్కువ అనే టాక్ ఉంది. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు రిలీజ్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమార్క్ ఒక్కటే 209 లొకేషన్స్ లో అజ్ఞాతవాసి చిత్రాన్ని ప్రదర్శించనుంది. ఏ తెలుగు చిత్రానికి అయినా సరే.. ఇది చాలా పెద్ద ఫిగర్ కావడం హైలైట్ అవుతోంది.

రిలీజ్ సమయానికి ఈ కౌంట్ మరింతగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ రికార్డులు అన్నిటిపైనా అజ్ఞాతవాసి కన్నేసిందనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని భారీగానే రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచి మరీ విడుదల చేయనున్నారనే అంచనాలు.. సంక్రాంతి సీజన్ కు విడుదల అవుతున్న వైనం చూస్తే.. ఇక్కడి రికార్డులపై కూడా పవన్ పవర్ చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

,  ,  ,  ,  ,