Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2017 10:27:04
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ తన పవర్ మరోసారి చూపించాడు. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కొత్త సినిమా గురించే చర్చంతా. ఉదయం పది గంటలకు అజ్నాతవాసి టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ లాంచ్ అని ముందు ప్రకటించగా.. నిన్న సాయంత్రం నుంచే హడావుడి మొదలైపోయింది. దీని తాలూకు హ్యాష్ ట్యాగ్స్ తో అభిమానులు రచ్చ మొదలుపెట్టారు. ఇక ఈ రోజు ఉదయం అయితే హంగామా మామూలుగా లేదు. డిస్కషన్లన్నీ దీని చుట్టూనే తిరిగాయి. 10 గంటలకు అన్న ప్రకారం ఫస్ట్ లుక్ లాంచ్ కాకపోవడం అభిమానులు అసహనానికి గురయ్యారు. రెండు గంటలు ఆలస్యంగా ఫస్ట్ లుక్ లాంచ్ అనగానే.. ఇక నిమిషాలు లెక్కపెట్టడం మొదలుపెట్టారు.

ఇక అభిమానుల నిరీక్షణకు 12 గంటలకు తెరపడింది. అజ్నాతవాసి పోస్టర్ సోషల్ మీడియాలోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ట్విట్టర్ అయినా.. ఫేస్ బుక్ అయినా.. ఎక్కడ చూసినా ఈ పోస్టరే. దీని గురించి డిస్కషన్లే. అభిమానుల నిరీక్షణకు తగ్గట్లే ఉండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పీఎస్పీకే 25 ఫస్ట్ లుక్.. అజ్నాతవాసి అనే హ్యాష్ ట్యాగ్స్ హైదరాబాద్ లో టాప్ లో ట్రెండ్ అయ్యాయి. నేషనల్ లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ మూడో స్థానంలో ట్రెండ్ అయింది. దీనిపై లక్షల్లో ట్వీట్లు పోటెత్తాయి. ఈ హంగామా కనీసం రెండు మూడు రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,