Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Mar-2017 11:18:51
facebook Twitter Googleplus
Photo

పోసాని మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా.. గుండెల్లో ఏమీ దాచుకోకుండా..అందులో ఏం ఉంటే అది మాత్రమే మాట్లాడే మనిషి. ఆవేశం వస్తే ఎంతలా ఊగిపోతాడో.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు ఏమాత్రం వెనుకాడని మనిషిగా చెప్పాలి. తాజాగా మోహన్ బాబు 67వ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలోని ఆయన స్కూల్ లో జరిగాయి. భారీ బహిరంగ సభను తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోసాని మాట్లాడారు. మాట్లాడింది తొమ్మిది నిమిషాలే అయినా.. సంచలన వ్యాఖ్యల్ని చేశారు. ఓపెన్ గా చెప్పేందుకు మొహమాట పడే చాలామందికి కళ్లు తెరిపించేలా ఆయన ఓపెన్ అయ్యారు. చాలామంది చాలా రకాలుగా పొగిడేస్తారు కానీ.. పోసాని మాదిరి పొగడటం మరెవరికీ సాధ్యం కాదన్న రీతిలో మోహన్ బాబును పొగిడేశారు.

మోహన్ బాబులో ఎలాంటి ఎక్స్ట్రా ఆర్డనరీ క్వాలిటీస్ లేవన్న ఆయన.. మోహన్ బాబు మామూలు మనిషి. ఆయనలో వందకు వంద శాతం మనిషి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. జంతు లక్షణాలు అస్సలు లేవు . మనిషికి.. జంతువుకు తేడా ఏమిటంటే.. నవ్వొచ్చింది పెద్దగా నవ్వుతారు. కోపం వచ్చింది పెద్దగా కోప్పడతారు. కన్నీళ్లు వచ్చాయి.. పెద్దగా దు:ఖిస్తారు. ఆవేశం వచ్చింది పెద్దగా ఆవేశపడతారు. ప్రేమ వచ్చింది.. భారతదేశమంత ప్రేమిస్తారు. కొంతమందికి నవ్వు వస్తుంది.. కానీ నవ్వరు (యాక్ట్ చేసి చూపించారు). కొంతమందికి కన్నీళ్లు వస్తాయి. కానీ.. కనిపించకుండా ఉండేందుకు ట్రై చేస్తారు. కానీ.. ఎవరేం అనుకున్నా మోహన్ బాబు మాత్రం హోల్ హార్టెడ్ గా తానేం అనుకుంటే అది చేస్తారు. సాధారణంగా చాలామంది వీడు నక్క లాంటోడు.. పిల్లి లాంటోడు.. పాము లాంటోడు..సింహం లాంటోడంటూ పోలుస్తుంటారు.మనుషుల్లో జంతు లక్షణాలు ఎక్కువయ్యాయి. కానీ.. మోహన్ బాబులో ఒక్కశాతం కూడా జంతు లక్షణాలు లేని మనిషి మోహన్ బాబు అని పొగిడేశారు.

తాను విద్యార్థులకు చెప్పదలుచుకున్నదేమిటంటూ.. ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కమ్మవాడినని.. ఆ విషయం తాను ఓపెన్ గా చెబుతానని.. కానీ ఇప్పుడు సమాజం ఎలా మారిందంటే.. నా కులం గొప్పది.. నా మతం గొప్పది.. అన్నట్లుగా మారిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుక్క మరో కుక్కను రానిస్తుందని.. గొర్రె మరో గొర్రెను రానిస్తుందని.. బర్రె మరో బర్రెను రానిస్తుందని కానీ.. మనిషి మాత్రం మరో మనిషిని రానివ్వరని.. వీడు మా కులపోడు.. వీడు మా మతం వాడంటూ సమాజాన్ని ముక్కలు..ముక్కలు చేసి పంచుకుంటుంటే.. పక్క మనిషి మన దగ్గరకు ఎలా వస్తాడు? అంటూ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి.. మీకు అన్నీ తెలుసు.. మీరు పెద్ద ముదుర్లన్న విషయం నాకు తెలుసన్న పోసాని.. ‘‘అమ్మాయిలకు 18 ఏళ్లు.. అబ్బాయిలకు 21 ఏళ్లు వచ్చేసరికి ఓటు హక్కు వస్తుంది. చాలామంది అది హక్కు అంటారు. కానీ.. అది బాధ్యత. విడిగా మీకు కులం పిచ్చి ఉండొచ్చు.. మతం పిచ్చి ఉండొచ్చు.కానీ.. ఓటు వేసేటప్పుడు మాత్రం కులం.. మతాల్ని మాత్రం మర్చిపోండి. వాటిని పక్కన పెట్టి ఓటు వేయండి’’ అని వ్యాఖ్యానిస్తున్నప్పుడు.. మోహన్ బాబు మైకు అందుకొని ఎక్స్ లెంట్.. హ్యాట్సాప్ అంటూ పోసానిని అభినందించారు.

ఒకడు తప్పుడోడు అయితే..వాడి ఫ్యామిలీకి మాత్రమే ఇబ్బందని.. కానీ ఒక ఎదవ ఎమ్మెల్యే అయితే సొసైటీ మొత్తం నాశనం అవుతుందన్న పోసాని.. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని వెల్లడించారు. ‘‘చిరంజీవి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మురళీ.. నీ గురించి నాకు తెలుసు.. నువ్వు గెలుస్తావంటూ టికెట్ ఇచ్చారు. నేను ప్రచారానికి వెళ్లి.. నాపేరు పోసాని కృష్ణ మురళీ.. నేను పోటీ చేస్తున్నాను. చిరంజీవి పార్టీ తరపున నిలుచుంటున్నా. నా క్యాస్ట్ ఇది. కానీ.. నేను నా క్యాస్ట్ వాడను. నేను డబ్బులు ఇవ్వను. మందు పోయించను. సిగిరెట్లు తాగించను. నా పోస్టర్ నేనే కొనుక్కుంటా. నా కారులో నేనే పెట్రోల్ పోయించుకుంటా. నా వెంట తిరిగే కార్యకర్తలకు అన్నం పెడతా. నేను నా ఎన్నికలకు ఖర్చు చేసింది రూ.7లక్షలు.ఎవరైనా నమ్ముతారా? నాకు పోటీగా నిలబడిన ఒక వ్యక్తి రూ.11కోట్లు ఖర్చు పెట్టాడు.మరొకరు రూ.13కోట్లు ఖర్చు చేశారు. రూ.13 కోట్లు ఖర్చు చేసినోడు గెలిచాడు. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే.. ప్రశ్నించే హక్కును కోల్పోతాం.ఇప్పటికే ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. నాకొక కూతురుంది.నేను నా కులపోడికే ఇచ్చి పెళ్లి చేసినా.. మంచి ఉద్యోగం.. మంచి నడవడిక.. మంచి ఆస్తూ ఉన్న వాడికి మాత్రమే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానే కానీ ఎదవకు ఇవ్వను కదా. నా కూతుర్ని ఒక మంచోడు.. గుణవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునే నేను.. నా ఓటును మాత్రం ఒక ఎదవకు వేయటం బాగుంటుందా? ఒక ఎదవ ఎమ్మెల్యే అయితే.. సమాజం మొత్తం నాశనం అవుతుంది. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి..ఆచి తూచి ఓటు వేయండి. నేను మీకు చెప్పదలుచుకున్నది ఇదే’’ అంటూ ముక్తాయించారు.

,  ,  ,  ,  ,  ,  ,