Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 12:47:23
facebook Twitter Googleplus
Photo

చర్చలన్నీ అజ్ఞాతవాసి చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నెల 16న రిలీజైన ఈ చిత్ర టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత మంగళవారం జరిగిన ఆడియో వేడుక.. ఆ రోజు రిలీజైన ఆడియో రెండు రోజులుగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ రోజు.. రేపు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి కాబట్టి ఈ వీకెండ్ అంతా డిస్కషన్లన్నీ వీటి చుట్టూనే తిరుగుతాయి. వీకెండ్ అయ్యాక మళ్లీ ఫోకస్ అజ్ఞాతవాసి మీదికి మళ్లనుంది. ఎందుకంటే ఈ నెల 26న అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ముందు 25న క్రిస్మస్ రోజే ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. మళ్లీ ఆలోచన మారింది. 26కే ట్రైలర్ ఫిక్స్ చేశారు.

‘అజ్ఞాతవాసి’ టీజర్లో అలా అలా షాట్లు చూపిస్తూ వెళ్లిపోయారు కానీ.. దీని కథేంటన్నది ఏమాత్రం హింట్ ఇవ్వలేదు. ట్రైలర్ కథేంటో అర్థమయ్యేలా తీర్చిదిద్దినట్లు సమాచారం. అందులో పవన్ ఒక పేలిపోయే డైలాగ్ కూడా చెబుతాడని అంటున్నారు. ఇంతకుముందు అత్తారింటికి దారేది ట్రైలర్లో సింహం.. గడ్డం.. అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఎలా పేలిందో తెలిసిందే. త్రివిక్రమ్ ఈసారి కూడా అలాగే ట్రై చేస్తున్నట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 29న అజ్ఞాతవాసి సెన్సార్ జరగనుంది. ఇక జనవరి తొలి వారం అంతా ప్రమోషన్లతో హోరెత్తించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,