Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:50:50
facebook Twitter Googleplus
Photo

కెరీర్ మొదటి నుండీ హీరో రానా వైవిధ్యభరితమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆ బాటలోనే రానా చేసిన బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలో అతని కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇదే ఉత్సాహంతో రానా దర్శకుడు తేజ
దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.
రాజకీయ నైపథ్యంలో సాగే ఈ కథకు చరిత్ర అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు తేజ చాలా రోజుల తరువాత సినిమా తీస్తుండటం, అదీ రాజకీయ నైపథ్యం గల కథను ఎంచుకోవడంతో ఈ సినిమాపై టీ ? టౌన్ లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,  ,  ,  ,  ,  ,