నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది మలయాళ కుట్టి కీర్తి సురేష్. ఆ దెబ్బకు నాని లాంటి క్రేజీ హీరోకు జంటగా నటించే అవకాశాన్ని పట్టేసింది కీర్తి. ఇంకొందరు స్టార్ హీరోల కళ్లు కూడా ఆమె మీద పడ్డట్లు సమాచారం. త్వరలోనే ఒకట్రెండు కొత్త ప్రాజెక్టులు కన్ఫమ్ కావచ్చు. వీటి సంగతలా వదిలేస్తే నానితో ఆమె చేస్తున్న ?నేను లోకల్? ఏడాది ఆఖర్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత కీర్తి తెలుగులో నటించిన మరో సినిమా కూడా జనవరిలో రాబోతోంది. ఆ సినిమా పేరు.. ?ఐనా ఇష్టం నువ్వు?.
నిజానికి తెలుగులో కీర్తి తొలి సినిమా ?నేను శైలజ? కాదు. ?ఐనా ఇష్టం నువ్వు?నే. ఆమె ముందు కమిటైంది.. షూటింగులో పా్ల్గొన్నది ఈ సినిమాకే. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణను హీరోగా పరిచయం చేయాలనుకున్నది ఈ సినిమాతోనే. ఐతే ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చిన స్థితిలో ఆగిపోయింది. ఈలోపు నవీన్ చేసిన రెండో సినిమా ?నందిని నర్సింగ్ హోం? అతడి తొలి సినిమాగా విడుదల కాబోతోంది. ఐతే తన తొలి సినిమా రెండో సినిమాగా రిలీజవుతుందని నవీన్ ప్రకటించాడు.
ఈ సినిమాకు సంబంధించి ఒక ఎపిసోడ్ రీషూట్ చేయాల్సి ఉందని.. ?నందిని నర్సింగ్ హోం? విడుదల తర్వాత ఆ పని పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని విజయ్ అన్నాడు. ఎలాగూ అప్పటికి కీర్తి కొత్త సినిమా ?నేను లోకల్? విడుదలై ఉంటుంది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అది ఐనా ?ఇష్టం నువ్వు?కు కలిసొస్తుందని భావిస్తున్నారేమో.