Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:50:31
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతానికి ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు కానీ.. రోబో-2 యూనిట్లో కొందరు చెబుతున్న దాని ప్రకారమే నిజమనే అనుకోవాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ?బాహుబలి? సినిమాతో రమ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె నటన గురించి అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఇక రజినీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

?నరసింహ? సినిమాలో రజినీ-రమ్య కెమిస్ట్రీ ఓ రేంజిలో పండింది. ఈ నేపథ్యంలోనే రోబో-2లో ఆమె నటిస్తే సినిమాకు మరింతగా క్రేజ్ వస్తుందన్న ఉద్దేశంతో వేరే వాళ్లకు అనుకున్న ఓ కీలక పాత్రను రమ్యకృష్ణకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రమ్యది సినిమాలో నెగెటివ్ రోల్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అయితే రజినీ-రమ్య మధ్య వార్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ?రోబో-2?కు ?2.0? అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో రజినీ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2017 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,