Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:08:27
facebook Twitter Googleplus
Photo

నెగటివ్ రోల్ చేస్తూ కామెడి పండించడం అంత తేలికైన విషయం కాదు. రెండు పడవల మీద కాలువేస్తే ప్రమాదమని అటు రచయిత ఇటు పాత్రధారీ ఆ దారిన వెళ్ళడానికి ఇష్టపడరు. అయితే పెన్నుతో సంచలనాలు సృష్టించిన త్రివిక్రమ్ కి ఈ దారంటే మహా ఇష్టం.

అతడులో తనికెళ్ళ భరణి - బ్రహ్మాజీలతో కామెడి కమ్ నెగటివ్ రోల్స్ చేయించిన త్రివిక్రమ్ ఇప్పుడు అ..ఆ.. లో దానికి కొనసాగింపుగా రావు రమేష్- అజయ్ లతో ఇటువంటి పాత్రలనే నటింపజేశాడు. సినిమా చూసిన వారికి వీరి నటన విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రావురమేష్ ఇరగదీసాడనే చెప్పాలి.

ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమాతో రావురమేష్ - 24 చిత్రంతో అజయ్ ఈ ఏడాదికి మంచి పాత్రలు దక్కించుకుని ప్రశంసలు అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ మార్క్ డిజైన్ జతకలవడంతో ఈ పెయిర్ హిట్ అయ్యిందని విశ్లేషణ.

,  ,  ,  ,  ,  ,  ,  ,