Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 14:53:46
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ ?తూనీగా..తూనీగా..?తో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ?అంతకుముందు ఆ తర్వాత?.. ?కేరింత?, ?కొలంబస్? వంటి విభిన్నమైన సినిమాలలో నటించారు. ఆయన తాజాగా మలయాళంలో విజయం సాధించిన ?ఆర్డినరీ? చిత్రానికి తెలుగు రీమేక్‌ అయిన ?రైట్‌రైట్‌? చిత్రంలో నటించాడు. ఇందులో పూజా జావేరి కథానాయిక. మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల అవుతున్న సందర్భంగా సుమంత్‌ అశ్విన్‌ చెప్పిన విశేషాలు?
ప్రశ్న) ఈ సినిమా కథ గురించి చెప్పండి?
స) అరకు సమీపంలోని గవిటి గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ఒరిస్సాకు సరిహద్దులో ఉండే ఆ గ్రామంలో కరెంట్‌ కానీ సెల్‌ఫోన్‌ వంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. గవిటి నుంచి యస్‌. కోటకు వెళ్లే ఆర్టీసీ బస్సు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రంలో ప్రేమ కంటే థ్రిల్లింగ్‌, సస్పెన్స్‌ అంశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్ర) ఇది మళయాలం సినిమా ?ఆర్డినరీ? సినిమా రీమేక్ కదా? కథలో ఏమైనా మార్పులు చేశారా?
స) మలయాళ ?ఆర్డినరీ? చిత్రంలో కొన్ని మార్పులు తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు మార్చాం. ప్రధమార్థం లో కాస్త స్లో గా ఉన్న సన్నివేశాలను తగ్గించి, హాస్య సన్నివేశాలు జోడించాం. ద్వితీయార్థంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సినిమా నిడివి కూడా రెండు గంటలలోపే ఉంటుంది.
ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
స) ఇందులో నేను బస్ కండక్టర్ పాత్రలో నటించాను. నిజానికి పోలీస్ కావాలనుకున్న ఓ యువకుడు కండక్టర్‌ ఉద్యోగం ఎందుకు చేయాల్సి వచ్చింది? చేరిన తర్వాత ఆ యువకుడి జీవితంలో జరిగిన ఓ సంఘటన అతడి జీవితాన్ని ఎలా మార్చింది అన్న కథాంశంతో సాగుతుంది. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది.
ప్ర) కండక్టర్ పాత్రలో మీరెలా నటించారు?
స) నిజానికి కథ చెప్పేటప్పుడు నాది కండక్టర్ పాత్ర అనగానే నాకు రజనీకాంత్ గుర్తొచ్చారు. పోలీస్, పైలెట్, కండక్టర్ లాంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని బాగా నమ్మకం. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ పాత్ర చేయడానికి కొన్నిసార్లు ఆర్టీసి బస్ లో ప్రయాణించి కండక్టర్లు ని గమనించాను. ఈ పాత్రకు తగ్గట్టు నా బాడీ లాంగ్వేజ్‌ ను మార్చుకున్నాను.
ప్ర) కాళికేయ ప్రభాకర్ పాత్ర గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో కాళికేయ ప్రభాకర్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. తనకి జంట ఉండదు కానీ ఎవరైనా లేడీ కండక్టర్స్ కనిపిస్తే ఫ్లర్ట్ చేస్తుంటాడు. తనతో నాకు మొదట్లో అంత పరిచయం లేకపోవడంతో రెండు రోజులు ఇబ్బంది పడ్దా ఆ తరువాత మాఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ప్రభాకర్ కి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది.
ప్ర) దర్శకుడు మను గురించి చెప్పండి?
స) దర్శకుడు మను చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశాడు. తను చాలా సాఫ్ట్. కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సినిమాని చాలా బాగా తీశాడు. అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్ శేఖర్ వి. జోసఫ్ వల్ల సినిమా క్వాలిటీ పెరిగింది.
ప్ర) నాన్నగారు ఈ సినిమా చూశారా? ఆయన ఏమన్నారు?
స) సినిమా పరిశ్రమలో నాన్నకు ఉన్న అనుభవంతో మంచి జడ్జిమెంట్‌ ఇస్తారు. నేను ఏదైనా కథ విన్నాక, నాన్నకు చెప్పి, ఆయన సలహాలు తీసుకుంటుంటాను. ఈ సినిమా చూసిన ఆయన ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ద్వితీయార్థం చాలా బాగుందన్నారు.
ప్ర) ఈ సినిమా ప్రమోషన్స్ కి పూర్తిగా బాలీవుడ్ స్టైల్ ని ఫాలో అయినట్టున్నారు?
స) అలాంటిదేమీ లేదు. నేను, ప్రభాకర్ మొదట్లోనే ఇలా చేయాలనుకున్నాం. సినిమా హిట్ టాక్ వచ్చేటంతవరకూ నేను ఇలా కండక్టర్ గెటప్ లో, ప్రభాకర్ డ్రైవర్ గెటప్ లో ప్రమోషన్స్ లో పాల్గోనాలని నిర్ణయించుకున్నాం. అలాగే కొనసాగిస్తున్నాం.
ప్ర) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?
స) ఓ రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఆ సినిమా నిర్మాతలే త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తారు.

,  ,  ,  ,