Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:46:09
facebook Twitter Googleplus
Photo

తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ .. విలక్షణమైన నటనను ప్రదర్శించే నటులలో 'అజయ్' పేరును కూడా చెప్పుకోవచ్చు. ఆరంభంలో విలన్ గా భయపెట్టినా, ఆ తరువాత అలరించే పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అజయ్ కి ఎలాంటి పాత్ర ఇచ్చినా, దానికి సహజత్వాన్ని ఆపాదించి ఆడియన్స్ లోకి తీసుకువెళతాడనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపే ఆయనకి సూర్య సినిమాలో అవకాశం దక్కేలా చేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య '24' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకిగాను ఎవరిని తీసుకోవాలా అనే విషయంగా సూర్య తర్జనభర్జన పడుతుంటే, అజయ్ అయితే బాగుంటాడని విక్రమ్ కుమార్ సూర్యకి చెప్పి ఒప్పించాడు. గతంలో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 'ఇష్క్' సినిమాలో నటించిన అజయ్ ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయడం వలన, ఇప్పుడీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులోనే కాదు, తమిళ్ ల్లోనూ అజయ్ బిజీఅయ్యే అవకాశం లేకపోలేదు.

,  ,  ,  ,  ,