Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2015 15:27:34
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీని.. ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. శ్రీమంతుడికి గ్రాస్ రూపంలో 145కోట్ల రూపాయలు రాగా.. షేర్ రూపంలో నిర్మాతలకు 85 కోట్లు ముట్టాయి.

తమ మూవీని ఇంత భారీ హిట్ చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ.. సినిమాలో చెప్పినట్లుగానే సమాజానికి తిరిగిచ్చే పని పెట్టుకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఏపీ - తెలంగాణ లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సూపర్ స్టార్.. తన సేవను ఇక్కడితో ఆపేయాలని అనుకోవడం లేదు. ఆ మూవీకి సంబంధించిన ప్రతీ సందర్భంలోనూ అంతో ఇంతో సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. రీసెంట్ గా శ్రీమంతుడు 14 సెంటర్లలో వంద రోజుల పండగ పూర్తి చేసుకుని ఈ తరానికి కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీన్ని పురస్కరించుకుని కొన్ని డొనేషన్స్ చేసింది శ్రీమంతుడు టీం.

బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కు 10 లక్షలు హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయల చెక్ అందించారు మహేష్ భార్య నమ్రత. తెరపై నీతలు చెప్పడంతో ఆగిపోకుండా.. ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రజా సేవ చేస్తూ.. శ్రీమంతుడు టీం శభాష్ అనిపించుకుంటున్నారు. సినిమారంగంలో ఉన్నవారిలో ఎలాంటి ఉదాత్త గుణం ఉంటుందో చాటి చెబుతున్నారు.

,  ,  ,  ,