Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 11:04:29
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వివేగం మూవీపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం తల అజిత్ కండలు తిరిగిన దేహంతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన రాగా.. యాంటీ ఫ్యాన్స్ ఇదంతా గ్రాఫిక్స్ అంటూ విపరీతమైన ట్రాలింగ్ చేసేశారు. దీనిపై దర్శకుడు శివ కానీ.. హీరో అజిత్ కానీ ఏ మాత్రం రియాక్ట్ కాలేదు.

వివేగం మూవీలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే ఉంటాయని ఇప్పటివరకూ టాక్ ఉంది. అందుకే సినిమా షూటింగ్ కొంత ఆలస్యమవుతోందని కూడా అంటున్నారు. ఇప్పుడీ విషయాన్ని కన్ఫాం చేస్తూ.. షూటింగ్ స్పాట్ నుంచి ఓ స్టిల్ ను విడుదల చేసింది వివేగం యూనిట్. ఇందులో అజిత్ లుక్ ని చూస్తే.. ఒక్కసారిగా షాక్ తినేయాల్సిందే. కాసింత బలహీనమైన గుండె ఉన్న వాళ్లైతే భయపడిపోతారు కూడా. ఒళ్లంతా రక్తం ఓడుతూ.. చిరిగిపోయిన బట్టలతో.. ఏదన్నా బాంబు దాడిలో గాయపడిన స్థాయిలో అజిత్ లుక్ నిజంగానే భయపెట్టేస్తోంది.

ఈ స్టిల్ ఆన్ లైన్ లోకి రాగానే వైరల్ అయిపోయింది. అజిత్ కి ఏమైందో అని కంగారు పడిపోయారు చాలామంది. అయితే.. ఇది మూవీలోని స్టిల్ అని తెలిసి అపుడు మనసు కుదుట పరుచుకున్నారు.

,  ,  ,  ,  ,  ,