Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:50:48
facebook Twitter Googleplus
Photo

తమిళ అభిమానుల మనసులు భారీస్థాయిలో గెలుచుకున్న కథానాయకులలో 'అజిత్' ఒకడు. అక్కడ అంతా ఆయనని అందగాడు అనే పిలుచుకుంటారు. నిజంగానే హీరో అంటే ఇలా వుండాలి అనేట్టుగానే ఆయన తెరపై కనిపిస్తాడు. అజిత్ గ్లామర్ .. ఆయన స్టైల్ అపారమైన క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. తాజాగా ఆయన నటించిన 'ఎన్నై అరిందాల్' అనే సినిమా సూపర్ హిట్ కావడంతో, అదే బ్యానర్ ఆయనతో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో ఆయన జోడీకట్టే అవకాశం శృతిహాసన్ కి దక్కింది. ఈ ఇద్దరినీ తెరపై చూసిన వారికి అందానికి అందం తోడైనట్టుగా అనిపిస్తుందన్నమాట.

ఇక కథానాయికగా మంచి మార్కులు సంపాదించుకుంటోన్న లక్ష్మీమీనన్ ఈ సినిమాలో అజిత్ చెల్లెలిగా నటిస్తుందడటం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'అచ్చమిల్లై'(భయం లేదు) అనే పేరును పరిశీలుస్తున్నారు. గతంలో అజిత్ కి 'వీరం' సినిమాతో హిట్ ఇచ్చిన శివ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ వుండగా, అనిరుథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

,  ,  ,  ,