Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2016 11:55:24
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం తన రెండో సినిమా మొదలెట్టే పనిలో బిజీగా ఉన్నాడు కుర్ర హీరో అఖిల్. అయితే నిన్నే మైత్రి మూవీస్ తో అసలు సినిమా అనుకోలేదని.. కాని మీడియా వారు ఆవేశంగా క్లారిటీ కనుక్కోకుండా ఏదో రాసేశారని ట్వీట్లు వేసేశాడు. ఈ సంగతి తెలిసిందే. అయితే ఇలా చెయ్యడానికి కారణం ఏమైయుంటుంది అంటారు?

నిజానికి ఎప్పుడైతే తన తొలి సినిమా చాలా అంచనాలతో వచ్చి డిజాష్టర్ అయ్యిందో.. అప్పుడే క్రిటిసిజం మొదలైంది. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా కూడా.. ఇప్పుడు అఖిల్ చుట్టూ ఉండే హైప్ వేరేలా ఉండేది. కాకపోతే ''అఖిల్'' ఫ్లాప్ అవ్వడం వలన.. అఖిల్ చాలా సతమతమవుతున్నాడు.. ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటూ కొన్ని రోజులు విశ్లేషణలు వచ్చాయి. తరువాత ఇదిగో ఇలా నిర్మాతలు బ్యాక్ అవుట్ అవుతున్నారు అంటూ వస్తున్నాయి. తన రెండో సినిమా మొదలై.. అది రిలీజై.. హిట్టు కొట్టేవరకు ఇలాంటి రూమర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాకపోతే అఖిల్ ప్రతీ దానికీ రియాక్ట్ అవ్వకుండా కూల్ గా ఉంటే బెటరేమో.

ఇప్పటికే అఖిల్ సినిమాకు సంబంధించి వంశీ పైడిపల్లి రాసిన కథ ఓకె అయ్యింది. జూన్ నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఆల్రెడీ ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాంలే.

,  ,  ,  ,  ,  ,  ,