Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:09:20
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడూ గతంలో హిట్టు డైరక్టర్లను నమ్ముకున్నాడు ఎన్టీఆర్. కాని చివరకు వాళ్లందరూ ముంచేశారు. అయితే ఫ్లాపు తీసిన డైరక్టర్ తో ఒకసారి చేసి చూద్దాం అంటూ ప్రయత్నిస్తే అప్పుడు మాత్రం హిట్టొచ్చింది. ఆ తరువాత ఇప్పుడు హిట్టు డైరక్టరే హిట్టివ్వడం మాత్రం అదిరిపోయింది.

సింహా తీసిన బోయపాటికి ఛాన్సిస్తే.. యంగ్ టైగర్ తో దమ్ము తీశాడు. అలాగే కిక్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఊసరవెల్లి చేతిలో పెట్టాడు. కందిరీగ తీసిన సంతోష్ శ్రీనివాస్ రభసతో షాకిచ్చాడు. గబ్బర్ సింగ్ తీశాడు కదా అని చూస్తే.. హరీశ్ శంకర్ రామయ్య వస్తావయ్యా అంటూ హిట్టును దూరం చేశాడు. ఇలా జరుగుతున్న సమయంలో రూటు మార్చిన ఎన్టీఆర్ 1-నేనొక్కడినే వంటి ఫ్లాపును తీసిన సుకుమార్ కు ఛాన్సిస్తే.. నాన్నకు ప్రేమతో అంటూ గ్రాండ్ హిట్టిచ్చాడు. ఇప్పుడు మాత్రం ఆల్రెడీ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు కొరటాల శివకు ఛాన్సిస్తే.. ఈయన నెగెటివ్ సెంటిమెంటుకు పూసాలు కదిలిపోయే రేంజులో జనతా గ్యారేజ్ తో రోరింగ్ హిట్టిచ్చేశాడు.

అయితే ఈ మధ్య కాలంలో ఒక హిట్టు తీసిన డైరక్టర్ ఎన్టీఆర్ కు కూడా హిట్టివ్వడం అంటే మాత్రం ఇదే ఫస్టు టైమ్ అని చెప్పాలి. అయితే వినాయక్ రాజమౌళి వంటి డైరక్టర్లు ఎప్పుడూ ఎన్టీఓడుతో హిట్లే తీశారులే. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,