Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:17:20
facebook Twitter Googleplus
Photo

రెండు మూడు రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నాగార్జునతో ఊపిరి లాంటి సూపర్ హిట్ అందించి.. అఖిల్ తో సినిమా చేసే బాధ్యత తీసుకున్న వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని.. అఖిల్ కు అతడికి విభేదాలు వచ్చాయని.. అఖిల్ రీమేక్ చేద్దామంటుంటే వంశీయేమో స్ట్రెయిట్ మూవీ చేయాలన్నాడని.. చివరికి ఇద్దరికీ పొసగక వంశీ టాటా చెప్పేశాడని తెగ చర్చించేసుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అఖిల్ కానీ.. వంశీ కానీ ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అఖిల్ లైన్లోకి వచ్చేశాడు. వంశీతో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.

ప్రింట్. . ఆన్ లైన్ మీడియాకు చెందిన మిత్రులారా.. నాకొక మేనేజర్ ఉన్నాడు. పీఆర్ టీం కూడా ఉంది. మీరేమైనా రాయాలనుకుంటే వాళ్లకు కాల్ చేసి కన్ఫమ్ చేసుకోండి. అలా కాకుండా తప్పుడు వార్తలు రాస్తే మీ క్రెడిబిలిటీనే దెబ్బ తింటుంది. నేను వంశీ కలిసి పని చేస్తున్నాం. నా సినిమా దేని గురించీ నేను అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు. సరైన సబ్జెక్ట్ దొరగ్గానే నా తర్వాతి సినిమాను ప్రకటిస్తా. థ్యాంక్ యూ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు అఖిల్. కాబట్టి ఇంతటితో అఖిల్ రెండో సినిమాకు సంబంధించిన రూమర్ రాయుళ్లు సైలెంటైపోతే బెటరేమో. మరి వంశీ పైడిపల్లి కూడా దీని మీద ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,