Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 12:13:54
facebook Twitter Googleplus
Photo

అక్కినేని ఇంట్లో పెళ్లి భాజాలు మోగ్రనున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే తనయుడు అఖిల్ నిశ్చితార్థంపై స్వయంగా ప్రకటన చేశారు నాగ్. డిసెంబ‌ర్ 9న అఖిల్ నిశ్చితార్ధ వేడుక జరగనుందని ప్రకటించారు. అలాగే.. చైతూ పెళ్లిపై కూడా త్వరలోనే ప్రకటన చేయస్తామని తెలిపారు.

అటు నాగ చైతన్యతో పాటు ఇటు అఖిల్ కూడా ప్రేమలో పడటం, తమకు కాబోయే జీవిత భాగస్వాములను వారే స్వయంగా ఎంచుకోవడం తెలిసిందే. నాగ‌చైతన్య స‌మంత‌తోనూ, అఖిల్ శ్రియా అనే స్నేహితురాలి ప్రేమ‌లోనూ ఉన్న‌ట్టు వార్త‌లు బ‌య‌ట‌కు వచ్చాయి. అయితే, నాగ్ పెద్ద కొడుకు చైతూని ప్రక్కన పెట్టి మొదట చిన్న కొడుకు నిశ్చితార్థ ప్రకటన చేయడం విశేషం.

అయితే, అఖిల్ నిశ్చితార్థం జరిగిన వారంలోపే చైతూ నిశ్చితార్థం కూడా జరగనున్నట్టు సమాచారమ్. ఇక, ఇద్దరి తనయుల పెళ్లిళ్లు మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఒకే వేదికపై అంగరంగ వైభవంగా జరిపించేందుకు నాగ్ ప్లాన్ చేశాడట. మొత్తానికి.. అక్కినేని ఇంట్లో పెళ్లి అప్పుడే పెళ్లి సందడి మొదలైపోయింది.

,  ,  ,  ,  ,  ,