తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్న హీరోయిన్స్ లలో అనుష్క ఒకరని చెప్పాలి. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంపైనే అవుతోంది. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతోంది. అయినా కూడా అనుష్క స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను అనే ఆలోచనతో వర్క్ చేస్తుంటోంది. ఇదే విషయాన్ని దర్శకుడు జి. అశోక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ప్రస్తుతం అశోక్ అనుష్కతో బాగమతి అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ.. నా జీవితంలో అనుష్క లాంటి హీరోయిన్ ని చూడలేదు. ఇంత స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నా కూడా చిన్న విషయాన్ని అయినా శ్రద్దగా నేర్చుకోవడానికి తపన పడుతుంటోంది. అసలైతే ఆమెకు బాగమతి కథను నేను బాహుబలి సినిమా స్టార్ట్ కాకముందే చెప్పను. కాకపోతే లింగా ఆ తర్వాత బాహుబలి షూటింగ్ మొదలవ్వడంతో డేట్స్ దొరకలేదు.
ఈ గ్యాప్ లో కథపై ఇంకా దృష్టిసారించాల్సిందిగా ఆమె సూచించారు. అయితే ఆ మధ్యలో ఆమె సైజ్ జీరో సినిమా కోసం లావుగా అవ్వడంతో షూటింగ్ కి మళ్లీ బ్రేక్ పడింది. చాలా నెలలు ఎదురుచూశాం. ఆమె సైజ్ తగ్గడానికి చాలా కష్టపడ్డారు. కొత్తదనం లేకపోతే అనుష్క చేయడానికి అంతగా ఇష్టపడరు. ఇక సినిమాలో అందరు అనుకున్నట్టు అనుష్క డ్యూయల్ రోల్ చేయడం లేదని దర్శకుడు చెప్పుకొచ్చాడు.