అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో సుశాంత్ నటిస్తోన్న ఆటాడుకుందాం రా అన్న సినిమాలో అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ చిన్న గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న విషయం కొద్దిరోజుల క్రిందటే తెలియజేశాం. తాజాగా ఇందుకు సంబంధించిన షూట్‌లో అఖిల్ నేడు జాయినయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్ కామియోకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా త్వరలోనే తన చిన్న రోల్‌ను పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ సహా ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుశాంత్ సరసన సోనమ్ భజ్వా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సుశాంత్ గత చిత్రాల్లానే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.