Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 16:17:05
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో మన ట్రేడ్ పనితీరు చూసుకుంటే.. ఒక హీరో తన గత సినిమాతో ఎంత వసూలు చేస్తే.. తదుపరి సినిమాను అంత రేటుకు అమ్మేస్తున్నారు. సపోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ హీరో కొత్త సినిమా 20 కోట్లు తెస్తే.. తదుపరి సినిమాను 20 కోట్లకు అమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో హీరో నాని తదుపరి సినిమా అయిన నిన్ను కోరి చాలా తక్కువ రేటుకే అమ్మేయడంతో ఇప్పుడు యావత్ ఇండస్ర్టీ షాకైపోయింది.

ఏషియన్ ఫిలింస్ వారు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు కలిపి.. నాని నిన్ను కోరి సినిమాను 14 కోట్లకు కొనుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చూసుకుంటే ఇది ఇప్పుడు నాని హిట్ మార్కెట్ దృష్ట్యా చాలా తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో విడుదలైన మజ్నూ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 12+ కోట్లు వసూలు చేసినప్పటికీ.. మొన్న వచ్చిన ''నేను లోకల్'' సినిమాకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 27.5+ కోట్ల షేర్ వచ్చేసింది. ఆ లెక్కన చూస్తే చాలామంది పంపిణీదారులు ఇప్పుడు నాని సినిమాను 25 కోట్లకు కొనడానికి కూడా పెద్దగా ఆలోచించరు. కనీసం 20 కోట్లయినా బిజినెస్ జరిగే ఛాన్సుంటుంది. కాని 14 కోట్లకే అమ్మారంటే మాత్రం.. ఈ నిర్మాతలు చాలా మంచోళ్లనే చెప్పాలి.

కొత్త కుర్రాడు శివ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు అమెరికాలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. జెంటిల్మన్ సినిమాలో నానితో ఆడిపాడిన నివేదా థామస్.. మరోసారి ఈ సినిమాలో జతకట్టింది

,  ,  ,  ,  ,  ,