Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2015 13:48:42
facebook Twitter Googleplus
Photo

అక్కినేని హీరో అఖిల్ ఆరంగేట్రం పైనే అందరి కళ్లు. అతడు నటించిన మొదటి సినిమా థియేటర్ లలోకి వచ్చేస్తోంది. 22 రిలీజ్ తేదీ. అంటే అఖిల్ కి కౌంట్ డౌన్ మొదలైనట్టే. అయితే 22 రావడానికి 15రోజులే మిగులుందింకా. ఇలాంటి కీలకమైన టైమ్ లో అసలు అఖిల్ సినిమాపై ఫోకస్ అనేదే కనిపించడమే లేదు. ప్రమోషన్ లేనేలేదు. అప్పట్లో ఆడియో రిలీజ్ కార్యక్రమం టైమ్ లో హడావుడి కనిపించింది. ఆ తర్వాత ఇక అంతా సైలెంటైపోయారు.

పైగా ఇప్పుడు జనాల ఫోకస్ అంతా రుద్రమదేవి 3డి - బ్రూస్ లీ సినిమాలపైకి మళ్లి పోయింది. ఈ రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వస్తున్నాయి. రుద్రమదేవి 3డి హిస్టారికల్ నేపథ్యంలో వస్తున్న 3డి సినిమాగా పాపులర్ అయ్యింది. దీని గురించి ఏ నలుగురు గుమిగూడినా మాట్లాడుకుంటున్నారు. గుణశేఖర్ ఫేట్ ని మార్చే సినిమాగా చెప్పుకుంటున్నారు. అలాగే చరణ్ బ్రూస్ లీ చిత్రంపైనా భారీ అంచనాలేర్పడ్డాయి. ఇలాంటి టైమ్ లో వస్తున్న అక్కినేని హీరో డెబ్యూ ఫిలిం ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్న డిష్కసన్ మొదలైంది. టాలీవుడ్ నటవారసుల్లో మహేష్ - చరణ్ - బన్ని ఆరంగేట్ర సినిమాలతో విజయాలు అందుకున్నారు. కానీ ఎన్టీఆర్ - నాగచైతన్య మాత్రం డిజాస్టర్ లతో ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అఖిల్ ఎలాంటి పలితాన్ని ఇస్తాడు? అన్న ఆసక్తి మొదలైంది.

అలాగే అఖిల్ తర్వాత మరో స్టార్ డమ్ ఉన్న నటవారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. కాబట్టి డిష్కసన్ వేడెక్కిపోతోంది. అఖిల్ షూటింగులో చిట్టచివరిదైన అక్కినేని అక్కినేని పాట చిత్రీకరణ పూర్తయింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలపైనే దృష్టిసారించాలని నిర్మాత నితిన్ - హీరో అఖిల్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

,  ,  ,