Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2016 10:59:24
facebook Twitter Googleplus
Photo

సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లలో గౌతమ్ మీనన్ ఒకడు. గౌతమ్ తీసే ప్రతి సినిమాలోనూ ఆయనదంటూ ఒక ముద్ర ఉంటుంది. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్లు.. క్లాసిక్స్ చాలానే ఉన్నాయి. అలాంటి దర్శకుడు మన రాజమౌళి తరహాలో సినిమాలు తీయడం తన వల్ల కాదు అంటున్నాడు. రాజమౌళితో పోలిస్తే తన శైలి పూర్తి భిన్నమని అతనన్నాడు. ?బాహుబలి? తరహా భారీ సినిమాలు మీరు తీయరా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా బదులిచ్చాడు గౌతమ్.

??నేను ఎలాంటి సినిమా తీసినా రియలిస్టిగ్గా ఉండేలా చూసుకుంటాను. ప్రేమకథ అయినా.. యాక్షన్ మూవీ అయినా.. సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. రాజమౌళి లాగా ఫాంటసీ మూవీస్ నేను తీయలేను. నేను ఒక సినిమా కోసం అంత ఖర్చు కూడా పెట్టించను. నాకంత ధైర్యం లేదు. అసలు నేను ఒక ఫాంటసీ మూవీని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తానో లేదో కూడా చెప్పలేను. నా సినిమాలు చాలా వరకు రియలిస్టిగ్గా ఉంటాయి. ఫాంటసీలు నా వల్ల కాదు. ఐతే నేను ఒకే శైలిలో వెళ్లిపోతున్నానేమో.. ఈ మొనాటనీని బ్రేక్ చేయాలేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో శైలి మార్చుకుని వేరే తరహా సినిమాలు చేస్తానో ఏమో నాకు తెలియదు?? అని గౌతమ్ అన్నాడు.

ఇక తాను ఎంత మోడర్న్ గా సినిమాలు తీసినప్పటికీ పేపర్ మీద పెన్నుతోనే ముందుగా స్క్రిప్టు రాయడం మొదలుపెడతానని.. అప్పుడే ఒక ఫీల్ తో స్క్రిప్టు రాయలగనని.. ఐతే నాలుగైదు పేజీలు రాశాక కంప్యూటర్ మీదికి వెళ్లిపోతానని గౌతమ్ వెల్లడించాడు.

,  ,  ,  ,