అఖిల్ అక్కినేని రెండో సినిమా అంటేనే జనాలు నవ్వేస్తున్నారు. ఆయనకి ఇప్పట్లో డైరెక్టర్లు దొరకరులే అంటూ సటైర్లు వేస్తున్నారు. ఇదీ నిజమే.
అఖిల్ రెండో సినిమా డైరెక్టర్ వీరేనంటూ చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ, పూరీ, త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి? ఇలా లిస్టు పెద్దదే. తాజాగా ఈ లిస్టులో మరో దర్శకుడు పేరు యాడ్ అయ్యింది. ?మనం?తో అక్కినేని కుటుంబానికి మరుపురాని హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇప్పుడు అఖిల్ కోసం ఓ కథని రెడీ చేశాడని సమాచారమ్.
ఇటీవలే వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి చిత్రాలు దాదాపు ఫిక్స్ అయ్యాయనే చెప్పుకొచ్చారు. అఖిల్ కూడా ధృవీకరించారు. కానీ.. ఆ దర్శకులు అఖిల్ చిత్రం నుంచి జారుకున్నారు. అఖిల్ ఇంకేమైనా ఆసిస్తున్నాడా.. ? డైరెక్టర్లు అఖిల్ ని పూర్థిస్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నారో తెలియడం లేదు. ఇప్పుడు అఖిల్ దర్శకుల లిస్టులో ?మనం? దర్శకుడు విక్రమ్ కూడా వచ్చిచేరాడు. మరి.. విక్రమ్ సినిమా నైనా సెట్స్ పైకి వెళుతుందో.. ? మద్యలోనే డ్రాప్ అవుతుందో .. ?? చూడాలి.