Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2017 14:56:52
facebook Twitter Googleplus
Photo

హీరోగా తొలిచిత్రం మీద పెట్టుకున్న ఆశలు అడియాశలు అయితే.. నట వారసులకు ఎంత ఇబ్బందిగా ఉంటుందన్నది అఖిల్ అక్కినేనిని చూస్తే అర్థమవుతుంది. ఎన్నో లెక్కలేసి మరీ తెరకెక్కించిన మూవీ ఆశించినంత బాగా ఆడకపోవటంతో అఖిల్ తో పాటు అక్కినేని ఫ్యామిలీ బాగానే డిజప్పాయింట్ అయ్యింది.

ఫస్ట్ మూవీ ఫస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి.. ఈసారి ఏ మాత్రం గురి తప్పకూడదన్న ఆలోచనతో తీవ్రంగా ఆలోచించి మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో మూవీ షూటింగ్ ఈ మధ్యనే షురూ అయ్యింది. అఖిల్ ను లవ్వర్ బాయ్ ఇమేజ్ లో చూపించి పాత్రను సిద్ధం చేయటంతో పాటు.. అతడి కెరీర్కు బ్రేక్ ఇచ్చేలా చేయాలన్నది ఆలోచనగా చెబుతారు. ఈమధ్యనే మొదలైన షూటింగ్ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లుగా సమాచారం.

సినిమాను మధ్యలో ఆపటానికి కారణం.. అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఒక స్పష్టత రాకపోవటమేనని చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ను హలో గురు ప్రేమ కోసమే కానీ జున్ను అన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,