Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 14:31:45
facebook Twitter Googleplus
Photo

సరైనోడులో నేను నటించిన వైరం ధనుష్ పాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఆ క్రెడిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుదే అన్నారు ఆది పినిసెట్టి. ఆయన ప్రతినాయకుడిగా నటించిన తాజా చిత్రం సరైనోడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆది శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
చిరంజీవిగారు మాట్లాడటం మర్చిపోలేని అనుభూతి?.
సరైనోడు చిత్రానికి తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో కొత్త తరహా చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్నా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వారికి బాగా నచ్చింది. నా నటన తని ఒరువన్ చిత్రంలోని అరవిందస్వామి నటనను తలపిస్తోందని అందరూ నన్ను ఆయనతో పోలుస్తున్నారు. సినిమా చూసి చిత్రపరిశ్రమకు చెందిన చాలా మంది ఫోన్‌లు చేసి అద్భుతంగా చేశావని అభినందిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిగారు ఫోన్ చేసి ఐదు నిమిషాల పాటు నా నటన, డైలాగ్ డిక్షన్ గురించి మాట్లాడటం మర్చిపోలేని అనుభూతినిచ్చింది.
దర్శకుడు చెప్పింది 30 శాతమే చేశాను?
నిజజీవితంలో నేను చాలా బుద్ధిమంతుడిని. తొలిసారి విలన్ పాత్ర అనే సరికి ఎలా చేయాలా అని చిత్రీకరణకు ముందే
నా పాత్ర ఎలావుంటే బాగుం టుందో రిహార్సల్స్ చేసుకుని సెట్స్‌కు వెళ్లాను. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను మనసులో విలన్ పాత్ర నేను ఊహించిన దానికి పూర్తిభిన్నంగా వుందని తెలిసి భయపడ్డాను. ఆ తరువాత నేను అనుకున్నది పక్కన పెట్టి దర్శకుడు చెప్పింది చెప్పినట్లు 30 శాతమే చేశాను. ఒక విచిత్రం నుంచి ఏకవీర వరకు విభిన్నమైన పాత్రాల్లో నటించాను. సరైనోడు చిత్రంతో నేను ఎలాంటి పాత్రల్లో నటించినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఏర్పడింది. ఈ సినిమాతో నటుడిగా నాకు మరింత గుర్తింపు లభించింది.
విలన్ పాత్రల కంటే హీరో పాత్రకే రిస్క్ ఎక్కువ?
పాత్ర ఆసక్తికరంగా వుంటే ఎలాంటి సినిమా అయినా సరే అది చిన్న చిత్రమా?పెద్ద చిత్రమా అని ఆలోచించకుండా ఇక నుంచి విలన్ పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. కథ ఆసక్తికరంగా వుండటంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్ర అయివుంటేనే చేస్తాను. వీటన్నింటితో పాటు సమర్థులైన సాంకేతిక నిపుణులు కూడా వుండాలి. నా దృష్టిలో విలన్ పాత్రల కంటే హీరో పాత్రకే రిస్క్ ఎక్కువ.
ఇప్పటి వరకు సమాంతర చిత్రాల్లో ఎక్కువగా నటించాను. ఇకపై కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులు మెచ్చే చిత్రాల్లో నటించాలనుకుంటున్నాను. త్వరలో ఓ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాను. ఈ చిత్రంలో నటనకు ప్రాముఖ్యతనిస్తూనే కమర్షియల్ అంశాలు వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాను.

,  ,  ,  ,