అందరూ నమ్మేది ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ చేసే ప్రతీ సినిమాకు వెనుకనే ఉండి ఎడిటింగ్ రూములో కత్తిపట్టుకుని కూర్చుంటారని. అలాగే కింగ్ నాగార్జున కూడా.. ఈ మధ్యన నాగచైతన్య అండ్ అఖిల్ సినిమాలను అలాగే ఎడిట్ చేస్తారని టాక్. కాని ఆ విషయంలో ఎంతవరకు నిజం?
ఇక హలో సినిమా మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్న వేళ.. నాగార్జున మాత్రం చాలా ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్పేశారు. అసలు అఖిల్ అండ్ నాగచైతన్య విషయంలో ఎలా ఉంటారో చెప్పారు. ఈరోజు ఇచ్చిన ఒక ఇంటర్యూలో నాగ్ మాట్లాడుతూ.. చైతూ అయినా అఖిల్ అయినా.. ఆ సినిమాల్లో నేను నటిస్తే నేను వెనుకే ఉండి చూసుకుంటా.. అలాగే నేను ప్రొడ్యూస్ చేస్తే నేను చూసుకుంటా.. నేను హీరోగా చేసే సినిమాలకు కూడా నేను వెనుకే ఉండి చూసుకోను. ఇక వేరే ప్రొడ్యూసర్లు తీసే సినిమాల్లో నేను వేలు పెట్టను. నేను చూడను అంటూ తేల్చి చెప్పేశారు.
ఇక హలో సినిమా గురించి కూడా భలే మాటన్నారండోయ్. మేం బిడ్డను కనేశం. డెలివరీ అయిపోయింది. ఇప్పుడు టెన్షన్ పడి లాభం లేదు. ఆ బిడ్డ ఫ్యూచర్ ఆడియన్స్ చేతిలో ఉంది.