Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 13:17:00
facebook Twitter Googleplus
Photo

ఎంత మూడు భాషల్లో తీసిన సినిమా అయినప్పటికీ స్టార్ హీరో నటించని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఊరికే డాబు కోసం చెబుతున్నారో మరి నిజంగానే అంత బడ్జెట్ అయిందో తెలియదు కానీ.. తమన్నా లీడ్ రోల్ చేస్తున్న ?అభినేత్రి? సినిమా రూ.70 కోట్లంటూ ప్రకటన ఇచ్చాడు ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్న కోన వెంకట్.

ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను మదరాసు పట్టణం.. నాన్న లాంటి సినిమాలు తీసిన ఎ.ఎల్.విజయ్ రూపొందిస్తున్నాడు. తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రరూ.20 కోట్లకు ఈ సినిమా తెలుగు హక్కుల్ని కొన్నట్లు ఇంతకుముందు వెల్లడించిన కోన.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ నోట్లో బడ్జెట్ రూ.70 కోట్లని పేర్కొన్నాడు.

ఈ సినిమాలో బ్రిటిష్ భామ అమీ జాక్సన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వెల్లడించాడు కోన. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగ్ లో ప్రభుదేవా.. అమీ జాక్సన్ ల మీద ఈ పాట చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందన్నాడు. ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారని.. ఇదొక వైవిధ్యమైన సినిమా అని.. అనుష్కకు ?అరుంధతి? ఎలాగో తమన్నాకు ?అభినేత్రి? అలా అవుతుందని చెప్పాడు కోన. చూద్దాం అంత విశేషం ఏముందో ఈ సినిమాలో.

,  ,  ,  ,  ,  ,