Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 14:32:10
facebook Twitter Googleplus
Photo

పాత్ర కోసం గుండు గీయించుకోమంటే హీరోలే ముందుకు రారు. ఇక హీరోయిన్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. నందితా దాస్ లాంటి వాళ్లు తప్ప గుండు గీయించుకోవడానికి ముందుకొచ్చే హీరోయిన్లు అరుదే. ఐతే పాత్ర డిమాండ్ చేస్తే తాను ఆ పని చేయడానికి సిద్ధమంటోంది కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్. గుండు గీయించుకోవడానికి నేను రెడీ. మరి దర్శక నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా? పక్కా స్క్రిప్టుతో వచ్చి.. నన్ను కన్విన్స్ చేస్తే గుండుతో కనిపించడానికి నాకే అభ్యంతరమూ లేదు అని అక్షర తెలిపింది.

ఇక ఈ గుండు సంగతి చెబుతూ.. తన చిన్నతనంలో తండ్రే స్వయంగా తనకు గుండు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది అక్షర. చిన్నపుడు తన హేర్ చాలా షార్ట్ గా ఉండేదని.. ఓసారి తన తండ్రి దగ్గరికి వెళ్లి గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందని అడిగానని.. వెంటనే ఆయన బాత్రూంకు తీసుకెళ్లి స్వయంగా గుండు చేసేశారని.. అప్పటికి తన వయసు ఏడేళ్లు మాత్రమేనని.. తాను తన తండ్రి అప్పుడప్పుడూ ఇలాంటి క్రేజీ థింగ్స్ చేస్తుంటామని అక్షర తెలిపింది. శ్రుతి హాసన్ లాగే పెద్ద హీరోయిన్ అయిపోదామని కలలు కన్న అక్షరకు పెద్దగా కలిసి రాలేదు. హిందీలో షమితాబ్ సినిమాతో పరిచయమైన అక్షరకు ఆ సినిమా చేదు అనుభవం మిగిల్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కున్న వివేగంలో నటిస్తోంది.

,  ,  ,  ,  ,