Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 14:16:19
facebook Twitter Googleplus
Photo

సినిమా గురించి తెలిసిన ప్రతి భారతీయుడు 2 పాయింట్ ఓ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి అన్ని బాషాల ప్రేక్షకులు శంకర్ అద్భుత సృష్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో పాత్రల గురించి ప్రస్తుతం ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది.

సినిమా ఎలా ఉంటుందో గాని ఈ రూమర్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. హీరోగా రజినీకాంత్ అలాగే మరొక క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో అక్షయ్ పాత్ర హైలెట్ అని అందరికి తెలిసిందే. అయితే అక్షయ్ ఇంతవరకు కనిపించని పాత్రలు కనిపిస్తున్నాడు. అయితే అదే క్యారెక్టర్ లో అక్షయ్ 12 విభిన్న పాత్రలతో కనిపించనున్నాడట. సినిమాలో ఆ సీన్ చాలా హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక అపరిచితుడు సినిమాలో ఒకేసారి ముగ్గురి క్యారెక్టర్స్ ని చూపించిన శంకర్ ఈ సినిమాలో కూడా అదే తరహాలో ఒక సీన్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఒక ఎపిసోడ్ లో అక్షయ్ నటనను చూస్తే కనురెప్ప కూడా వేయరని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. దాదాపు 450 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్ గా ఉండనుందట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలిజ్ కానుందని మొన్నటివరకు టాక్.

,  ,  ,  ,  ,