Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Oct-2017 10:32:27
facebook Twitter Googleplus
Photo

నటులోకరైతే వారి గాత్రం మరొకరిది అవుతోంది. చాలా వరకు పరభాషా నటులు ఎక్కువగా ఇండుస్త్రీలలోకి వస్తుండడంతో వారి పాత్రలకు వేరొకరు వాయిస్ డబ్బింగ్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే కొంతమంది నటులు మాత్రం తమ వాయిసే ఉండాలని చాలా ఇష్టంగా భాషలను నేర్చుకొని మరి డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అదే చేస్తున్నాడట. కాని అక్కడే ప్రాబ్లం ఎదురైంది.

2.0 సినిమాతో మొదటి సారి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న ఈ నటుడు తమిళ్ డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటున్నాడట. నెగిటివ్ రోలో లో కనిపిస్తుండడంతో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ కూడా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా జాగ్రత్తగా అయ్యేట్లు చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల డబ్బింగ్ లో అక్షయ కుమార్ తన వాయిస్ ఓవర్ ను క్యారెక్టర్ కి తగ్గట్టు ఇవ్వలేదట.

సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఈ విషయాన్ని అక్షయ్ కి చెప్పాడట. నీ వాయిస్ ఇంకా కొంచెం భయంకరంగా ఉండాలి. పాత్ర ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాగే ని వాయిస్ కూడా గాంబీర్యంతో ఉండాలని చెప్పాడట. శంకర్ కూడా అదే విషయాన్ని చెప్పడంతో అక్షయ్ కొంచెం వాయిస్ ని చేంజ్ చెయ్యాలని ప్రయత్నించి.. చాలా కొత్తగా ట్రై చేశాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,