Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 10:55:20
facebook Twitter Googleplus
Photo

అందానికి అందం.. అంతకు మించిన నటన కలగలిసి ఉండే హీరోయిన్లు ఈ రోజున తక్కువే. స్కిన్ షో మీదనే ఫోకస్ చేసే ముద్దుగుమ్ముల విరివిగా వచ్చేస్తున్న వేళ.. కూసింత నటన కూడా వచ్చి ఉండటం పూజా హెగ్డేకు ప్లస్ గా చెప్పాలి. తాజాగా అమ్మడు నటిస్తున్న డీజే విడుదలకు సిద్ధమైపోతోంది.

ఇదిలా ఉంటే.. పూజను తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ ఆఫర్ ను పూజ ఓకే చేయటానికి ఆమెకు ఇవ్వజూపిన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నందుకు పూజాకు కోటి రూపాయిలు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. చాలా త్వరగా కోటి క్లబ్లో పూజ చేరిపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత భారీ మొత్తంలో పారితోషికం అందుకోవాలంటే నాలుగైదు మాంచి హిట్లు ఉండాలి.కానీ.. ఇవేమీ లేకుండానే పూజకు కోటి ఇచ్చేందుకు ముందుకు రావటం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

అయితే.. పూజాహేగ్డేకు ఇస్తున్న కోటి మొత్తానికి రెండు కారణాలుగా చెబుతున్నారు. ఆమె తాజాగా నటించిన డీజే చిత్రం ఒకటి తెచ్చిన ఇమేజ్ అయితే.. రెండోది బన్నీతో చేసిన తర్వాత ఆ వెంటనే ఒక యువ హీరోతో నటించేందుకు ఓకే అనటం సాహసంతో కూడుకున్నదని.. అంత రిస్క్ చేస్తున్నప్పుడు కోటి మొత్తం పెద్ద విషయం కాదని చెబుతున్నారు.

చాలా త్వరగా కోటి క్లబ్ లో చేరిన పూజా.. అంతేలా మొయింటైన్ చేయాలంటే మాత్రం కాలం కలిసి రావాలంటున్నారు.

,  ,  ,  ,  ,