Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Aug-2015 17:13:07
facebook Twitter Googleplus
Photo

తొలి సినిమాతోనే తెలుగు నేర్చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె దూకుడు చూసి తోటి కథానాయికలంతా షాక్ అయ్యారు. ఏళ్లనుంచి వున్నాం... మాకు రాలేదే తెలుగు అంటూ ఈర్ష్య పడ్డారు. కానీ రకుల్ మాత్రం సినిమా సినిమాకీ మరింతగా పట్టు పెంచుకొంటూ అచ్చమైన తెలుగు మాట్లాడేస్తోంది. ఇప్పుడామె ఢిల్లీకి వెళ్లినా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ `ఎలా ఉన్నారు?` అంటూ మాట్లాడేస్తోందట. అది చూసి అందరూ షాక్ అవుతున్నారట. `తెలుగుమ్మాయిలా మారిపోయావ్` అంటున్నారట. ఆమె కూడా అవును తెలుగమ్మాయినే నేనని చెబుతుందట. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది రకుల్.

ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఇంత వేగంగా కష్టపడి తెలుగు నేర్చుకొంది కాబట్టి రకుల్ కి ఓ కోరిక ఉందట. అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తోందట. ఇంతకీ ఆ కోరికేంటో తెలుసా? తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం. తాను ముద్దు ముద్దుగా తెలుగు పలుకులు పలకడాన్ని తెరపై చూసుకోవాలని రకుల్ ఆశపడుతోంది. `కిక్2`కి ఆమె బాగా ట్రై చేసిందట డబ్బింగ్ చెప్పుకొందామని. కానీ కుదర్లేదట. ఈసారి మాత్రం తప్పకుండా నాకు నేను డబ్బింగ్ చెప్పుకొంటా అంటోంది. రకుల్ డెడికేషన్ సూపర్బ్ కదూ! మరింతకీ ఆమె కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి. అన్నట్టు `కిక్2` ఇంటర్వ్యూ ల్లో భాగంగా ఆమె చెబుతూ మహేష్ సినిమాలో తాను నటిస్తున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. కాల్షీట్లు సర్దుబాటు కాక ఎప్పుడో నో చెప్పేశాననీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఎన్టీఆర్ చరణ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని చెప్పింది రకుల్.

,  ,  ,