Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 12:16:30
facebook Twitter Googleplus
Photo

ఆర్నెల్ల కిందట ?కుమారి 21 ఎఫ్? సక్సెస్ మీట్ లో ఉన్నట్లుండి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు దిల్ రాజు. సుకుమార్ దర్శకత్వంలో తమ బేనర్లోనే దేవిని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత సుకుమార్.. దేవి కూడా ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు. కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ సినిమా సంగతి ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టు సోదిలో లేకుండా పోయింది. రాజు.. సుక్కు.. దేవి.. ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయారు. వీళ్లకున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే దేవి హీరోగా తెరకెక్కాల్సిన సినిమా పక్కకు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా దేవిని ఈ విషయమై కదిలిస్తే.. తన తెరంగేట్రం ఆలస్యమయ్యే అవకాశముందని.. కానీ సుకుమార్ దర్శకత్వంలో తాను హీరోగా సినిమా చేయడం మాత్రం ఖాయమని వెల్లడించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా తనకున్న కమిట్మెంట్ల వల్లే హీరోగా సినిమాను వాయిదా వేసినట్లు చెప్పాడు. ఈ ఏడాది ఇప్పటికే నాన్నకు ప్రేమతో.. సర్దార్ గబ్బర్ సింగ్.. లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేశానని.. ఇప్పుడు చిరంజీవి 150 సినిమాతో పాటు బాలయ్య వందో సినిమా కూడా చేయాల్సి ఉందని.. వీటిని చేతిలో పెట్టుకుని ఇక తన సినిమా గురించి ఎలా ఆలోచిస్తానని దేవి అన్నాడు. ఈ రెండు సినిమాల పని పూర్తి చేశాక తన అరంగేట్ర సినిమా గురించి ఆలోచిస్తానని.. ఆలోపు సుకుమార్ కూడా ఖాళీ అవుతాడని ఆశిస్తున్నానని దేవి చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,