Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Nov-2016 15:06:47
facebook Twitter Googleplus
Photo

సెలబ్రిటీలు అందునా సినీ హీరోల్ని పెళ్లి చేసుకుని వారి భార్యలుగా వెళ్లిన అమ్మాయిల కష్టాలు మాములుగా ఉండవు. అప్పటి దాకా చాలా సింపుల్ గా లైఫ్ గడిపేసిన వారికి సడెన్ గా సెల్రబిటీ వైఫ్ స్టేటస్ వచ్చి పడ్తోంది. ఎక్కడికెళ్లినా వేల కళ్లు అబ్జర్వ్ చేస్తుంటాయ్. పర్మిషన్ ఉన్నా లేకపోయినా వందల కెమెరాలు క్లిక్ మనిపిస్తాయ్. ఇక సరదాగా బయటికెళ్లినప్పుడు ఒక్కోసారి కొత్త కొత్త పనులు కూడా చేయాల్సి వస్తోంది. తన భార్యకి సైతం ఇలాంటి కష్టాలు తప్పట్లలేదంటున్నాడు అల్లరి నరేష్.

నేను విరూపా ఎక్కడికైనా వెళితే గుర్తు పట్టేసి ఫోటోస్ దిగడానికి చాలామంది వస్తుంటారని.. సెల్ఫీల వరకు ప్రాబ్లమ్ లేదు కానీ కొంతమందితై ఏకంగా తన భార్య చేతిలోనే కెమెరా పెట్టేసి ఫోటోస్ తీయమంటుంటారని అప్పుడు విరూపా కష్టాలు మాములుగా ఉండవంటున్నాడు. చూసీ చూసీ నన్ను నీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ ని చేసేశావుగా అని విరూపా డైలాగ్స్ కూడా వేస్తుందని.. అందుకే కలిసి వెళ్లినప్పుడు చేతిలో చేయ్యేసి నడవకుండా 10 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెబుతుందట.

ఇక పాప పుట్టిన తర్వాత నా లైఫ్ టోటల్ గా మారిపోయిందని.. ఇప్పుడు ఎక్కడలేని సహనం అలవాటైపోయిందని.. ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికొచ్చి కూతురి మొహం చూస్తే చాలు కొత్త రీఫ్రెష్మెంట్ వచ్చేస్తుందంటున్నాడు. గత కొంతకాలంగా ఫ్లాప్స్ రుచి చూస్తోన్న అల్లరి నరేష్ కొత్త మూవీ ఇంట్లో దెయ్యం నాకేమీ భయం మీద చాలా హోప్సే పెట్టుకొన్నాడు. ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ వారమే రిలీజ్ కానున్న మూవీ నరేష్ ఆశలు తీరుస్తుందో లేదో చూడాలి.

,  ,  ,  ,