సుశాంత్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి కరెంట్, అడ్డా సినిమాలతో లవర్ బాయ్‌గా మెప్పించిన హీరో. తాజాగా ఆయన జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ఆటాడుకుందాం రా ఈ నెల్లోనే విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఆగష్టు 19న విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు స్పష్టం చేసేశారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో గత శుక్రవారమే మార్కెట్లోకి విడుదలైంది.
ఇక అదే రోజున విడుదల చేసిన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సుశాంత్‌కు ఈ సినిమా తప్పకుండా మంచి బ్రేక్ ఇస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ చిన్న గెస్ట్ రోల్స్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. నాగ సుశీల్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్ సరసన సోనమ్ భజ్వా హీరోయిన్గా నటించారు.