Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 11:29:55
facebook Twitter Googleplus
Photo

సెల్ఫీ రాజా.. అల్లరి నరేష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఈ అల్లరోడు చేసే సందడిపై టాలీవుడ్ ఆడియన్స్ లో చాలానే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే మిగతా కాస్టింగ్ ఎవరో పట్టించుకోకుండానే జనాలు థియేటర్లకు వస్తారు. కాకపోతే ఈ మధ్య ఈ అల్లరి హీరోల సినిమాల్లో స్టఫ్ తగ్గిపోయింది. కామెడీ విషయంలో కూడా స్పూఫ్ లు తప్ప.. సొంత కామెడీ చేయకపోవడం.. కనీసం ట్రై చేయకపోవడంతో రిజల్ట్ తేడా కొట్టేస్తోంది.

ఇప్పుడు రాజా.. వన్ అండ్ ఓన్లీ సెల్ఫీ రాజా అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లరి నరేష్. రోజుకో రకమైన సెల్ఫీ ఫోజులతో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో అయితే.. ఓ చేత్తో పామును పట్టుకుని ల్యాండ్ ఫోన్ తోనే సెల్ఫీ ఫోజు ఇచ్చేశాడు. చూసేందుకు ఇది కామెడీగానే ఉన్నా.. ఆ పోస్టర్ ని చూస్తే ఓ రకమైన భయం వేయకమానదు. భయం అంటే అంత భయానకంగా ఉందని కాదు.. ఆ గ్రాఫిక్స్ లో క్వాలిటీ చూసన్న మాట.

చేతిలో ఉన్న పాము - వెనకాల ఉన్న పాము పుట్ట బ్యాక్ గ్రౌండ్ మొత్తం గ్రాఫిక్సే. అది కూడా ఏ 1980ల్లోనో 90ల్లోనో కనిపించే టైపు గ్రాఫిక్స్ అవి. సినిమాల్లో కూడా కాదు.. ఫోటో స్టూడియోల్లో కూడా ఇంతకంటే బెటర్ గ్రాఫిక్స్ వాడుతున్నారు. ఫస్ట్ లుక్ అంటూ ఇచ్చిన పోస్టర్ కూడా ఇదే బాపతుగా ఉంటుంది. గ్రాఫిక్స్ వాడకపోయినా పర్లేదు కానీ.. మరీ ఇంత దారుణమైన క్వాలిటీతో చూడమంటే.. జనాలు పారిపోతారు సెల్ఫీ రాజా.

,  ,  ,  ,