Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 12:26:53
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో ఈ పదాన్ని మరీ సింపుల్ గా వాడేస్తున్నారేమో అనిపించకమానదు. ఒక్క సినిమా హిట్ అయితే స్టార్ హీరో.. ఓ బ్లాక్ బస్టర్ తీస్తే స్టార్ డైరెక్టర్ లాంటి మాటలు వినిపించేస్తున్నాయి. కానీ స్టార్ అనే వర్డింగ్.. చాలా పవర్ ఫుల్. ఎంత శక్తిమంతమైనదో.. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ను చూస్తే అర్ధమవుతుంది.

సహజంగా అభిమానులు- స్టార్ స్టేటస్.. ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. కానీ రజినీకి మాత్రం.. స్టార్సే ఫ్యాన్స్ గా ఉంటారు. బాలీవుడ్ బాద్షా అయిన షారూక్ ఖాన్ నుంచి.. దేశవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు.. సూపర్ స్టార్ కి వీరాభిమానులు అంటే ఆశ్చర్యం వేయక మానదు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేశాడు. జైలవకుశ రిలీజ్ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న యంగ్ టైగర్.. అనేక కొత్త విషయాలను ఆడియన్స్ తో పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన అభిమాన హీరో కబుర్లను కూడా చెప్పేశాడు. నేను తమిళ్ సినిమాలు ఎక్కువగా చూడను. అయితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు మాత్రం చాలా పెద్ద అభిమానిని అని చెప్పాడు యంగ్ టైగర్.

రజినీ సార్ స్టైల్ ను చూసి ఆయనను అభిమానించలేదు. ఆయన స్క్రీన్ పై కనిపించినపుడు.. చుట్టూ ఓ తేజస్సు వచ్చేస్తుంది. కళ్లెదురుగా కనిపిస్తే రెప్ప కూడా వేయలేము. అందుకే ఆయన పెద్ద స్టార్.

,  ,  ,  ,  ,  ,