Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:47:23
facebook Twitter Googleplus
Photo

అల్లరి నరేష్ సినిమాలే కాదు, ఆ సినిమాల టైటిళ్లు కూడా గమ్మత్తుగా వుంటాయి. చూడగానే నవ్వు తెప్పిస్తాయి. ఇప్పుడు తాజాగా నరేష్ నటించే ఓ సినిమా టైటిల్ కూడా అలాగే చక్కిలిగింతలు పెట్టేలా వుంది. ఈ సినిమా పేరు 'జేమ్స్ బాండ్'. దీనికి ట్యాగ్ లైన్ 'నేను కాదు నా పెళ్లాం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్కును రిలీజ్ చేశారు. ఇందులో 'పోటుగాడు' ఫేం సాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఈ కుర్రాడు శ్రీను వైట్ల వద్ద పనిచేశాడు.

,  ,  ,  ,  ,