Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2015 16:07:52
facebook Twitter Googleplus
Photo

జయాపజయాలతో పని లేకుండా కొందరికి అవకాశాలు వస్తుంటాయి. అందం - అభినయం - ఒడ్డు - పొడుగు నచ్చితే మన దర్శకనిర్మాతలు సక్సెస్ తో పని లేకుండా అవకాశాలిస్తుంటారు. అందాల సలోని సన్నజాజి ఇలియానా - మిల్కీ వైట్ తమన్నా వీళ్లంతా ముంబై నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే. ఈ భామల కెరీర్ని పరిశీలిస్తే విజయాల కంటే పరాజయాలే ఎక్కువ. అయినా కెరీర్ పరంగా నిలదొక్కుకోగలిగారంటే ఒడ్డు పొడుగు - సొగసరితనం ఉండడం వల్లనే. ఇటీవలి కాలంలో రాశీ ఖన్నా - రకూల్ ప్రీత్ లాంటి నాయికల్లోనూ అలాంటి క్వాలిటీస్ చూసే మనవాళ్లంతా అవకాశాలిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో మరో ముంబై ముద్దుగుమ్మ సైలెంట్ స్టార్ లా దూసుకొచ్చేస్తోంది.

పేరు సోనారిక బదోరియా. నాగశౌర్య సరసన జాదూగాడు లాంటి ఫ్లాప్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఫ్లాపైనా ఈ అమ్మడు కెరీర్ పరంగా చతికిలబడిపోలేదు. అప్పటికే విష్ణు సరసన సరదాగా అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నాయికగా ఎంపికైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో నాయికగా నటించేస్తోంది. ఇప్పుడు సందీప్ కిషన్ సరసన మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అందుకుంది. డైలాగ్ రైటర్ రాజసింహా ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఒక్క అమ్మాయి తప్ప అనేది ఈ సినిమా టైటిల్. ఇదో చక్కని రొమాంటిక్ కామెడీ. ఏదేమైనా సోనారిక సైలెంట్ స్టార్లా దూసుకొస్తోంది. మునుముందు రకూల్ రాశీలతో పోటీపడుతుందేమో చూడాలి.

,  ,  ,  ,