Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2015 17:34:01
facebook Twitter Googleplus
Photo

ఈ టైటిల్ చూసి అక్కినేని కుటుంబానికి చెందిన హీరోయిన్.. నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో కలిసి సినిమా చేయబోతున్నారని.. వాళ్లు ఎవరై ఉంటారని గెస్ చేసే పనిలో పడిపోకండి. ఇది అల్లరి నరేష్ కొత్త సినిమాకు పెట్టాలనుకున్న టైటిల్ అట. కానీ మనసు మార్చుకుని ?జేమ్స్ బాండ్? అనే టైటిల్ తో సరిపెట్టేశారట. ఈ విషయాన్ని నరేషే స్వయంగా వెల్లడించాడు.

జేమ్స్ బాండ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని అడిగితే.. ??అది కావాలని పెట్టింది కాదు. ఈ సినిమా కోసం చాలా టైటిళ్లు అనుకున్నాం. ఓ దశలో అమ్మాయి అక్కినేని.. అబ్బాయి నందమూరి అని పెడితే ఎలా ఉంటుంటా అని ఆలోచించాం. చివరికి జేమ్స్ బాండ్ టైటిల్ ఓకే అయింది. జేమ్స్ బాండ్ అంటే అందరికీ పరిచయమైన పేరు. పిల్లలకూ త్వరగా ఎక్కేస్తుంది. నేను కాదు నా పెళ్లాం అని ట్యాగ్ తగిలించగానే నా తరహా అల్లరి సినిమాకు యాడ్ అయింది?? అని నరేష్ చెప్పాడు.

పెళ్లయ్యాక వస్తున్న తొలి సినిమా కాబట్టి ?జేమ్స్ బాండ్? కొంచెం ప్రత్యేకమైన సినిమానే అని.. ఇది తన అభిమానుల్ని పూర్తిగా అలరిస్తుందని నరేష్ అన్నాడు. ??సినిమాలో మా ఆవిడ క్యారెక్టర్ జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుంది. కానీ నిజజీవితంలో నాకు దొరికిన భార్య చాలామంచిది. పెళ్లయ్యాక పెద్దగా మార్పులేమీ లేవు. పార్టీలెక్కువైపోవడం వల్ల పొట్ట మాత్రం కొంచెం పెరిగింది. చుట్టాలంతా వరుసబెట్టి విందులిస్తున్నారు. దీంతో డైట్ కంట్రోల్ తప్పింది. నాకు బయట తిరుగుళ్లు తక్కువే కాబట్టి మిగతా జీవితంలో ఏ మార్పూ లేదు?? అని నరేష్ చెప్పాడు.

,  ,  ,