Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 12:01:59
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ ఎంత మంచి సీజనో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సంక్రాంతి సీజన్‌కు సినిమాలు పోటీ పడుతుంటాయి. అలా పోటీలో దూకిన వాటిలో అక్కినేని నాగార్జున నటించిన ?సోగ్గాడే చిన్న నాయినా? కూడా ఒకటి. కొత్త దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి తాము పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ రోజుతో ఈ సినిమా వందరోజులు పూర్తిచేసుకుంది. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఆదోని లలో ఈ సినిమా వందరోజులు ఆడటం విశేషం.
బంగార్రాజు పాత్రలో బాగా ఒదిగిపోయిన అక్కినేని నాగార్జున ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్తుకున్నాడు. అలాగే రాము పాత్రలో కూడా తన ప్రత్యేకతను చూపాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యక్రిష్ణ, లావన్య త్రిపాటి నటించగా అనసూయ, హంసానందిని, దీక్షాపంత్, అనుష్క లు కీలక పాత్రల్లో నటించారు. బంగార్రాజు పాత్ర కొనసాగింపుగా ఇదే కాంబినేషన్ లో త్వరలో ?బంగార్రాజు? సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,  ,