Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 13:01:03
facebook Twitter Googleplus
Photo

కొంత కాలంగా తన రేంజ్కు తగ్గ హిట్స్ ఇవ్వటంలో తడబడుతూ వస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్, మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. రొటీన్ కామెడీతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో, ఇక మీదట స్టోరి సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నాడు. అదే సమయంలో గతంలో చేసినట్టుగా ఏడాది రెండు మూడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు.

ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సెల్ఫీరాజా సినిమాను పూర్తి చేసిన నరేష్ జూలై 15 ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వెంటనే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా షూటింగ్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరోసినిమాను లైన్లో పెడుతున్నాడు.

సీనియర్ నటుడు, రచయిత కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మరో సినిమాకు ఓకె చెప్పాడు నరేష్. అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'మేడ మీద అబ్బాయి' అనే టైటిల్ను ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

,  ,  ,  ,  ,