Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2017 11:08:39
facebook Twitter Googleplus
Photo

పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. దక్షిణాదిపై ఉత్తరాదికి చులకన భావం ఉందనే మాట చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. రాజకీయంగా సామాజికంగా సంగతి పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ చులకన భావం బాగా ఎక్కువే. ప్రధానంగా సౌత్ సినిమా అంటే తమిళ్ కు మాత్రమే అంతో ఇంతో విలువ ఉంటుంది తప్ప.. టాలీవుడ్ అంటే మరీ చిన్నచూపు చూస్తారు.

ఇప్పుడు బాహుబలి2 బాలీవుడ్ సినిమా చరిత్రను కూడా తిరగరాసేసింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రంగా.. డైరెక్టు హిందీ మూవీస్ అన్నింటినీ దాటేసి.. ఓ తెలుగు డబ్బింగ్ సినిమా రికార్డ్ సృష్టించేసింది. బాహుబలి సృష్టిస్తున్న ప్రభంజనాన్ని.. బాలీవుడ్ కి ఓ గుణపాఠం అంటున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. తాజాగా ఓ అవార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి చిత్రరాజాన్ని తీసిన రాజమౌళిని అభినందనల్లో ముంచెత్తాడు. సినిమాతో పాటు మొత్తం యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు అల్లు.

దేశీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన బాహుబలి టీంకు అభినందనలు.. తెలుగు ప్రజల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళిని ప్రశంసించే అవకాశం దక్కడం నా అదృష్టం.

,  ,  ,  ,